సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం చిట్కుల్ గ్రామంలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కిషన్ మెగా శ్రమదానం నిర్వహించారు. 30 రోజుల ప్రణాళిక గొప్పదని... పల్లె నిద్ర కార్యక్రమంలో గ్రామ అధికారులతో కలిసి శ్రమదానం చేయడం వల్ల ప్రజలందరిని చైతన్యపరిచి గ్రామల అభివృద్ధికి తోడ్పడుతామని కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని సినీ నటులు చిట్టిబాబు, సుమన్ శెట్టి అన్నారు.
'గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం' - గ్రామ అభివృద్ధి
30 రోజుల ప్రణాళికలో భాగంగా సంగారెడ్డిలో జిల్లా ఇంటర్ బోర్డు అధికారి కిషన్ మెగా శ్రమదానం నిర్వహించారు. కార్యక్రమంలో సినీ నటులు చిట్టిబాబు, సుమన్ శెట్టి పాల్గొని గ్రామస్థుల్లో ఉత్సాహం నింపారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం :కిషన్