తెలంగాణ

telangana

ETV Bharat / state

'నా భర్తను కావాలనే హత్య చేశారు' - SI ANWESH REDDY

రోడ్డుపై తుపాకితో బలవన్మరణానికి పాల్పడిన ఫైజల్ కేసులో తన భార్య నార్సింగి ఠాణాలో సంప్రదించింది. తన భర్త ధైర్యవంతుడని ఆత్యహత్య చేసుకునేవాడు కాదని ఆమె పోలీసులతో అన్నారు.

డబ్బుల కోసం అతడిని ఎవరైన ఇబ్బంది పెట్టారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం : పోలీసులు

By

Published : Jul 7, 2019, 11:49 PM IST

రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 4న నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డుపై తుపాకితో ఆత్మహత్యకు పాల్పడిన ఫైజల్ కథ మరో మలుపు తిరిగింది. అతడి భార్య నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది. తన భర్త మంచివాడని..ఎవరో కావాలనే హత్య చేసి ఉంటారని నార్సింగ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఫైజల్ ఎవరెవరితో తిరిగారు, ఏఏ ప్రదేశాల్లో ఉన్నారు, ఎక్కడికెళ్లారు తదితర వివరాలను పరిశీలిస్తున్నట్లు నార్సింగి ఎస్సై అన్వేష్ రెడ్డి తెలిపారు.
తన భర్త చనిపోయేంత పిరికివాడు కాదని ఫైజల్ భార్య పోలీసులకు వివరించారు. ఫైజల్ తండ్రి మిలటరీ ఉద్యోగి అని... ఫైజల్ ధైర్యవంతుడని తెలిపారు. ఫైజల్ ఎవరికైన డబ్బులు చెల్లించాల్సింది ఉందా.. అతడిని ఎవరైనా డబ్బులకోసం ఇబ్బంది పెట్టి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోందన్నారు పోలీసులు.

నా భర్త ఆత్యహత్య చేసుకునేంత పిరికివాడు కాదు : ఫైజల్ భార్య

ABOUT THE AUTHOR

...view details