తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ రహదారిపై 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

వరుణుడి బీభత్సం ఉగ్రరూపం దాల్చింది. అక్కడా ఇక్కడా అని కాదు.. తెలంగాణలోని అన్నిచోట్ల విరామం లేకుండా వాన దంచికొట్టింది. దీనివల్ల హైదరాబాద్- విజయవాడ జాతీయరహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Vehicles Traffic jam at 10 km on the Hyderabad- Vijayawada national highway
జాతీయ రహదారిపై 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

By

Published : Oct 14, 2020, 9:02 AM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం ఇనాంగూడ వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీనివల్ల పలుకార్లు నీట మునిగాయి. రోడ్లుకు ఇరువైపులా పది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

దీనివల్ల జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

జాతీయ రహదారిపై 10 కి.మీ మేర నిలిచిన వాహనాలు

ఇవీచూడండి:కీసర తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details