తెలంగాణ

telangana

ETV Bharat / state

కారు బోల్తాపడి ఇద్దరు మృతి... ఒకరికి తీవ్రగాయాలు - రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

కారు నియంత్రణ కోల్పోయి అదుపు తప్పి బోల్తాపడి... ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా... ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహేశ్వరంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

two-members-died-in-road-accident-at-maheswaram-in-rangareddy-district
కారు బోల్తాపడి ఇద్దరు మృతి... ఒకరికి తీవ్రగాయాలు

By

Published : Jul 31, 2020, 9:25 AM IST

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని శ్రీనగర్ ప్యాబ్ సిటి సమీపంలో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి మృతిచెందగా... ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులు కందుకూరు గ్రామానికి చెందిన వికాస్ రెడ్డి, భార్గవ్ రెడ్డిలుగా గుర్తించారు. వీరు ప్యాబ్​సిటీలోని రేడియంట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జేసీబీ సాయంతో మృతదేహాలని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details