తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసనే ప్రత్యామ్నాయం - MALLAREDDY

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్, భాజపాలకు భంగపాటు తప్పదని కార్మిక, శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఈనెల 9న రంగారెడ్డి జిల్లాలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పర్యటిస్తారని తెలిపారు.

పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం

By

Published : Mar 3, 2019, 6:10 PM IST

తెరాస అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కార్మిక, శిశు సంక్షేమ శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో తెరాస పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు.

లోక్​సభ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలిచి ముఖ్యమంత్రికి బహుమతి ఇద్దామని కార్యకర్తలకు సూచించారు. పేదల కోసం ఎక్కువ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్​కే దక్కిందని కొనియాడారు. కాంగ్రెస్, భాజపాలకు డిపాజిట్లు రావనిజోస్యం చెప్పారు.

పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం

ఇవీ చూడండి:గులాబీ గూటికి సండ్ర

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details