రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మాన్యగూడలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. హయత్‌నగర్‌కి చెందిన జెక్కుల కిషన్ ఆచూకీ లేకపోవడం ఈనెల 6న కుటుంబ సభ్యులు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా...పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. అతని బంధువులే హతమార్చినట్లు ఎల్బీనగర్ డీసీపీ యాదగిరి వెల్లడించారు. ఐలయ్య కుటుంబికులను కిషన్ వేధించేవాడని.. అందువల్లనే చంపేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు డీసీపీ పేర్కొన్నారు. మెుత్తం ఏడుగురు కలిసి హతమార్చారని పేర్కొన్నారు. ఐలయ్య, సురేష్, నరేష్, శేఖర్‌ను రిమాండ్ తరలించినట్లు... శ్రీశైలం, కృష్ణ, నరేష్ పరారీలో ఉన్నారని డీసీపీ వివరించారు. వారి నుంచి ఒక ఆటో, ఒక స్కూటర్, కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
మాన్యగూడ హత్యకేసును ఛేదించిన పోలీసులు - జెక్కుల కిషన్
రంగారెడ్డి జిల్లా మాన్యగూడలో జరిగిన హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు ఎల్బీనగర్ డీసీపీ యాదగిరి తెలిపారు.
మాన్యగూడ హత్యకేసును ఛేదించిన పోలీసులు