తనకు ఓటు వేస్తే ప్రశ్నించే గొంతుకనై పనిచేస్తానని... ఒక్కసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లను బీఎన్ రెడ్డి నగర్ తెదేపా అభ్యర్థి గద్దె విజయ్ నేత అభ్యర్థించారు. డివిజన్లో ఇంటింటి ప్రచారంలో తెదేపాకు ఓటు వేయాలని కోరారు. హైదరాబాద్ అభివృద్ధి జరిగింది తెలుగుదేశం పార్టీతోనేనని... తనకు అవకాశం ఇస్తే డివిజన్ను అభివృద్ధిలో ముందు ఉంచుతానని హామీ ఇచ్చారు.
నాది ప్రశ్నించే గొంతుక: విజయ్ నేత - జీహెచ్ఎంసీ ఎన్నికలు తాజా వార్తలు
ఒక్క అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానని తెదేపా అభ్యర్థి గద్దె విజయ్ నేత అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా బీఎన్ రెడ్డి నగర్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.
నాది ప్రశ్నించే గొంతుక: విజయ్ నేత
16 ఏళ్లుగా ప్రజల మధ్యనే ఉంటూ... ప్రజా సమస్యలపై పోరాడుతున్నానని ఆయన తెలిపారు. ఈ ఒక్క సారి అవకాశం ఇస్తే తానేంటో నిరూపించుకుంటానన్నారు.
ఇదీ చదవండి:సాయంత్రం 6 గంటలలోపు ప్రచారాన్ని ముగించాలి: ఎస్ఈసీ