Statue of Equality Inauguration Celebrations : సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు ఆరాధన శోభాయమానంగా జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి.
Statue of Equality Inauguration Celebrations Second day : శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా అగ్నిమథనం పూర్తి అయింది. రెండో రోజు శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి కర్రలతో అగ్ని మథనం చేశారు. మంత్ర పూర్వకంగా శమి, రావి కర్రలను పెరుగు చిలికినట్లు చిలుకుతూ వచ్చిన అగ్నిని కుండలాల్లో పోసి హోమాన్ని నిర్వహిస్తున్నారు. భక్తులు భగవన్నామస్మరణ చేస్తుంటే రెండు కర్రల రాపిడికి పట్టిన అగ్నిని 1035 కుండలాల్లో పోశారు. ఏకకాలంలో 5 వేల మంది రుత్వికులతో 1035 కుండలాల్లో హోమాలు నిర్వహిస్తున్నారు. ప్రవచన శాలలో వేద పండితుల ప్రవచన పారాయణం జరుగుతోంది.
Statue of Equality : శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాలకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు. కరోనా నిబంధనలు అమలవుతున్నాయో లేదో చూశారు. మరోవైపు.. ఎల్లుండి ప్రధాని పర్యటన ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్షించారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లపై చర్చించారు.
ముచ్చింతల్‌కు కేసీఆర్..