భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన విదేశీయులను వారి స్వదేశాలకు పంపించే కార్యక్రమం క్రమంగా కొనసాగుతోంది. అందులో భాగంగా ఇవాళ శంషాబాద్ జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో 101 మంది అమెరికన్లను వారి దేశానికి తరలించారు. ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రత్యేక రిలీఫ్ విమానం ద్వారా ఈ సాయంత్రం 3.52 గంటలకు వీరిని ముంబయికి తరలించారు. అక్కడ నుంచి డెల్టా ఎయిర్ లైన్స్ ద్వారా అమెరికాకు వెళ్తారని జీఎంఆర్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రత్యేక విమానంలో అమెరికాకు 101 మంది - gmr
హైదరాబాద్ శంషాబాద్ అంతర్దాతీయ విమానాశ్రయం నుంచి నేడు మరో 101 మంది అమెరికన్లను వారి దేశానికి తరలించారు. ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రత్యేక విమానం ద్వారా ముంబయికి తరలించినట్లు... అక్కడి నుంచి డెల్టా ఎయిర్లైన్స్ ద్వారా అమెరికా వెళ్తారని జీఎంఆర్ యాజమాన్యం ప్రకటించింది.
ప్రత్యేక విమానంలో అమెరికాకు 101 మంది
ఇప్పటివరకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 11 ప్రత్యేక విమానాలను విదేశీయుల తరలింపునకు ఉపయోగించినట్లు పేర్కొంది. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళ్టి వరకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 850 మందికి పైగా అమెరికా, జర్మనీ, యూకే, యూఏఈ దేశాలకు తరలించినట్లు వివరించింది.
ఇవీ చూడండి: లాక్‌డౌన్ తర్వాత పరిశ్రమలు యథావిధిగా నడవాలి: కేటీఆర్