రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పీఎస్ పరిధిలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళాలు పగులగొట్టి దుండగులు రెండు ఇళ్లలో 60 వేల విలువైన సొత్తును అపహరించారు. సాయినగర్ కాలనీలో ఉండే సురేందర్ బెంగళూరులో బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తాళం పగులగొట్టి ఉందని స్థానికుల ద్వారా తెలుసుకున్న బాధితుడు... ఇంట్లో ఉన్న 35 వేల నగదు, అర తులం బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని....! - Choris at Hayathnagar
హైదరాబాద్ నగర శివారులోని హయత్నగర్ పీఎస్ పరిధిలో దొంగలు చెలరేగిపోతున్నారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. పీఎస్ పరిధిలో రెండు ఇళ్లలో 60 వేల విలువైన సొత్తును దోచుకున్నారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కొలను శివారెడ్డి కాలనీలో శ్రీపాదరావు తల్లిదండ్రులు కింది పోర్షన్లో ఉంటుండగా పది రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లారు. ఈ రోజు తాళం పగులగొట్టి ఉందని గ్రహించిన కుమారుడు 3 వేల నగదు, వెండి వస్తువులను అపహరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి దొంగలు తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీ చేసేందుకు యత్నించారని, ప్రహరీ గోడ దూకినట్లు, కాళ్లకు, చేతులకు మట్టి అంటిన గుర్తులు ఉన్నాయని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న హయత్ నగర్ పోలీసులు వరుస దొంగతనాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఇవీ చూడండి: ఎంత సింపుల్‌గా బైక్ చోరీ చేస్తున్నాడో..