నల్గొండ జిల్లా దామచర్ల మండలం రాజగుట్టకు చెందిన గుంటి భాస్కర్ రెండో కుమార్తె 11 నెలల దీక్ష మూడు రోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం పాపను అంబులెన్సులో హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద వారు ప్రయాణిస్తున్న అంబులెన్సును ఆటో ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన దీక్ష ప్రమాదస్థలిలోనే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అంబులెన్స్‌ను ఢీకొన్న ఆటో... చిన్నారి మృతి - auto
తమ కలల సౌధం కుప్పకూలింది. నవమాసాలు మోసిన తల్లికి శోకమే మిగిలింది. అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టి తల్లిని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో జరిగింది.
ప్రమాదానికి గురైన అంబులెన్సు