తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లకు బియ్యం పంపిణీ

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామ పంచాయతీలలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లకు జిల్లా సర్పంచ్​ల సంఘం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి 25 కిలోల బియ్యం అందజేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో కార్మికులు చేస్తున్న సేవలు మరువలేమని అన్నారు.

rice distribution in rangareddy district
పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లకు బియ్యం పంపిణీ

By

Published : Apr 30, 2020, 6:27 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని లారీ యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నందారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని 14 గ్రామపంచాయతీలలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు, ఆశావర్కర్లకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు బూడిద రాంరెడ్డి ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. లాక్​డౌన్ నేపథ్యంలో గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు ఎప్పటికీ మరువలేమని అన్నారు. చాలీచాలని జీతంతో కార్మికులు మనకోసం సేవలు చేయడం ఎంతో అభినందనీయమన్నారు.

ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపును ప్రజలందరూ స్వాగతించారని బూడిద రాంరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్, రాష్ట్ర లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షులు నందారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్​లు పాల్గొన్నారు.

ఇవీ చూడండి: శ్రమ ఫలితమే కేసుల తగ్గుదల: మంత్రి ఈటల







ABOUT THE AUTHOR

...view details