రాష్ట్రంలో ఈరోజు ఒకటి, రెండు చోట్ల అతిభారీ వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం(hyderabad meteorological department) తెలిపింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురిసే అవకాశం ఉండగా.. రానున్న మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
Rains in telangana: రాష్ట్రంలో రాగల 3 రోజులు మోస్తరు వర్షాలు - rains for three days in telangana due to Surface trough at bay of bengal
రాష్ట్రంలో రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(rains in telangana) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది.
తెలంగాణలో వర్షాలు
వాయువ్య బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో.. విదర్భ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి సంభవించిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తున ఉపరితల ద్రోణి ఏర్పడిందని వెల్లడించారు. తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉత్తర- దక్షిణ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదీ చదవండి:HERITAGE SITES: వారసత్వ కట్టడాల కోసం మూడు స్థాయిల్లో కమిటీలు