బాహ్య వలయ రహదారి వల్ల హైదరాబాద్ చుట్టూ ఎక్కడైనా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ తెలిపారు. మరో 8 లాజిస్టిక్ పార్కుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. నగరానికి అత్యాధునిక వసతులతో 2 రైల్వే టెర్మినల్స్ రానున్నాయని అన్నారు. ఓఆర్‌ఆర్ చుట్టూ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మంగళ్‌పల్లి సమీపంలో హెచ్‌ఎండీఏ- అంకాన్ లాజిస్టిక్స్ పార్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. మంగళ్‌పల్లి లాజిస్టిక్ పార్క్‌తో ప్రత్యక్షంగా వేయి మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు.
మరో 8 లాజిస్టిక్ పార్కులు నిర్మిస్తాం: కేటీఆర్ - minister ktr news
ఇతర రాష్ట్రాలతో పోటీ పడి, వ్యాపారవేత్తలను మెప్పించి... రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకువస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. మౌలిక వసతుల కల్పన పెంచి పారిశ్రామికాభివృద్ధిని పెంచడమే తమ లక్ష్యమని చెప్పారు. త్వరలోనే బాటసింగారం లాజిస్టిక్ పార్క్ నిర్మాణం పూర్తి చేసి, జనవరిలో ప్రారంభిస్తామని తెలిపారు.
minister ktr inaugurate mangalpally logistic park