తెలంగాణ

telangana

రెండో డోసు కోసం ప్రభుత్వాస్పత్రులకు పోటెత్తిన జనం

By

Published : May 8, 2021, 7:17 PM IST

రాష్ట్రంలో నేటి నుంచి తొలి డోసు టీకాను నిలిపివేశారు. రెండో డోసు టీకా మాత్రమే ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మలక్​పేట, సరూర్​నగర్ ఆస్పత్రుల ఎదుట రద్దీ నెలకొంది. వ్యాక్సిన్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

రెండో డోసు కోసం ప్రభుత్వాస్పత్రులకు పోటెత్తిన జనం
రెండో డోసు కోసం ప్రభుత్వాస్పత్రులకు పోటెత్తిన జనం

కరోనా రెండో దశ ప్రభావంతో మలక్‌పేట, సరూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రుల్లోని కొవిడ్ టీకా కేంద్రాల్లో రద్దీ నెలకొంది. శనివారం నుంచి రెండో డోసు మాత్రమే ఇస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రమంలో రెండో డోసు కోసం జనాలు ఆస్పత్రుల బాటపట్టారు.

వ్యాక్సిన్ కోసం పెద్ద ఎత్తున తరలిరావడంతో మలక్‌పేట ఆస్పత్రిలో వందమందికే టోకెన్లు జారీ చేశారు. టోకెన్లు ఉన్నవారికే టీకా ఇస్తున్నారు. సరూర్​నగర్​ ఆస్పత్రికి జనాలు పోటెత్తారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో భౌతిక దూరం పాటించకపోయినా మాస్కులు ధరించారు.

ఇదీ చదవండి:కరోనా కట్టడికి రాష్ట్రాల 'లాక్​డౌన్' అస్త్రం

ABOUT THE AUTHOR

...view details