తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం - హయత్​నగర్

​ హయత్​నగర్ మండలం పెద్ద అంబర్​పేట జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఒక వ్యక్తి  అక్క‌డికక్క‌డే మరణించగా మరొకరికి గాయలయ్యాయి.

పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం

By

Published : Aug 25, 2019, 7:50 AM IST

రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ మండలం పెద్ద అంబర్​పేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. డివైడర్​ను ఢీకొట్టిన లారీ.. పక్కనుంచి వెళ్తున్న బొలెరో వాహనంపై పడటం వల్ల ఓ వ్యక్తి మృతి చెందగా మరో యువకుడు స్వల్పంగా గాయపడ్డాడు. నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన అరుణ్ మిశాల్ మ్యూజిక్ ప్లేయర్​గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి నగరం నుంచి విజయవాడవైపు వెళ్తుండగా పెద్ద అంబర్​పేట్ కూడలి సమీపంలో ప్రమాదం జరిగింది. రహదారిపై లారీ అడ్డంగా పడటం వల్ల కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం తెలుసుకున్న హయత్​నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని తీసేశారు.

పెద్ద అంబర్​పేట వద్ద రోడ్డు ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details