రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం - Telangana news
రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం
09:01 February 15
రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ వాలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 2 లేగ దూడలపై దాడి చేసినట్లు వెల్లడించారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి వారు సమాచారం ఇచ్చారు. గతంలో ఆవు దూడను చంపిన ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రేపటి నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ
Last Updated : Feb 15, 2021, 12:58 PM IST