రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తిలో ఔషధ నగరి రోడ్డు విస్తరణ పనులకు ఇటీవల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తీర్ణణలో భూములు కోల్పోతున్న రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభించారు. ఇక్కడి రైతులు జాతీయ బీసీ కమిషన్ను ఆశ్రయించారు.
'రైతులకు ఏమివ్వలేదు.. పనులెలా మొదలు పెట్టారు'
ఔషధ నగరి రోడ్డు విస్తీర్ణణ కోసం భూములను ప్రభుత్వం చట్టబద్ధంగా తీసుకోవడం లేదన్నారు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారీ. రైతులకు సమాచారం ఇవ్వకుండా వారి భూమిని ఎలా చదును చేస్తారని ప్రశ్నించారు.
భూములు ఎలా చదును చేస్తారు: ఆచారీ
ఈరోజు యాచారం మండల పరిషత్ కార్యాలయంలో భూసేకరణ ఫిర్యాదులపై జాతీయ బీసీ కమిషన్ సభ్యులు ఆచారీ విచారణ చేశారు. భూములను ప్రభుత్వం చట్టబద్ధంగా తీసుకోవడం లేదన్నారు. రైతులకు సమాచారం ఇవ్వకుండా భూమిని ఎలా చదును చేస్తారని ప్రశ్నించారు. పరిహారం ఇవ్వకుండా.. పనులకు టెండర్లు ఎలా పిలుస్తారన్నారు. విచారణకు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి:భాగ్యనగరంలో మోగుతున్న కరోనా ఘంటిక