ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఈ స్థానానికి తెరాస తరఫున మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి బరిలో నిలిచారు. చేవెళ్ల రెవెన్యూ కార్యాలయంలో శంకరపల్లి, షాబాద్, మొయినాబాద్, చేవెళ్ల మండలాలకు సంబంధించిన ఓటర్లు పోలింగ్లో పాల్గొననున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గ స్థానానికి ఇద్దరు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 806 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పోలింగ్