తెలంగాణ

telangana

ETV Bharat / state

మనుషుల్లాగే పశువులకు ఆధార్​ కార్డ్​లు - minister talasani

త్వరలో పశువులకు ఆధార్ కార్డులు ఇచ్చే యోచనలో ఉంది ప్రభుత్వం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర స్థాయి గొర్రెల, మేకల నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్​ ఈ ప్రకటన చేశారు.

పశువులకు ఆధార్​ కార్డ్​లు

By

Published : Jun 18, 2019, 2:07 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని యాచారం మండలం చింతపట్ల గ్రామంలో రాష్ట్ర స్థాయి గొర్రెల, మేకలను నట్టల నివారణ మందుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ, మత్య్స, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గొర్రెలకు నట్టాల నివారణ మందు వేసి... కాపరులకు దాణా పంపిణీ చేశారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా సంవత్సరానికి మూడు సార్లు నట్టల మందు వేస్తున్నామని తలసాని అన్నారు. మనకు ఆధార్ కార్డ్ ఎలాగైతే ఉందో అలాగే పశువులకు కూడా ఆధార్ కార్డ్​ ఇస్తామని మంత్రి వెల్లడించారు.

పశువులకు ఆధార్​ కార్డ్​లు

ABOUT THE AUTHOR

...view details