తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకోవద్దు'

కరోనాకు భయపడి ప్రజలు ఆందోళనకు గురికావద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేటుకు పోటీగా ప్రభుత్వాస్పత్రిలో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ సంస్థ అందించిన నూతన అంబులెన్స్, ఐసీయూ కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

minister sabitha said Don't go to private hospitals and spend lakhs
'ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి లక్షలు ఖర్చు చేసుకోవద్దు'

By

Published : Aug 10, 2020, 8:11 PM IST

రంగారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రిలో ఐసీయూ కేంద్రం, నూతన అంబులెన్స్​ను జిల్లా పరిషత్ ఛైర్​పర్సన్ అనితా రెడ్డి, ఎమ్మెల్యే కాల యాదయ్యతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి షాద్​నగర్, కొండాపూర్ ఆస్పత్రులకు అంబులెన్స్​లు ఇవ్వడం ఎంతో సంతోషమని మంత్రి చెప్పారు.

ప్రతి పీహెచ్​సీలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వాళ్లు ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని సూచించారు. ఎంతమందికైనా పరీక్షలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం కరోనాను ఎదుర్కోవడానికి అనునిత్యం కృషి చేస్తోందన్నారు.

ఇదీ చూడండి :24 గంటల్లో చాచా హత్యకేసును ఛేదించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details