తెలంగాణ

telangana

ETV Bharat / state

జల్​పల్లిలో తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రిని సందర్శించిన సబిత - covid center in jalpally municipality

రంగారెడ్డి జిల్లాలో జల్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని పహాడిషరీఫ్​ ప్రాంతంలో ప్రీమియర్ ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన కరోనా చికిత్స కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం చేసిన ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు.

jalpally municipality, minister sabitha inspected covid ward, covid hospital in jalaplly
జల్​పల్లి మున్సిపాలిటీ, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జల్​పల్లిలో తాత్కాలిక కొవిడ్ వార్డు

By

Published : May 4, 2021, 4:01 PM IST

Updated : May 4, 2021, 4:10 PM IST

రంగారెడ్డి జిల్లా జల్​పల్లి మున్సిపాలిటీ పహాడిషరీఫ్ ప్రాంతంలోని ఫంక్షన్ హాల్​లో ఏర్పాటు చేసిన కరోనా చికిత్సా కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. కేంద్రంలో రోగులకు అందించే ఆహారాన్ని, మందులను పరిశీలించారు. వసతులపై అధికారులను ఆరా తీశారు.

36 గంటల్లో 50 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఈ కార్యరక్రమంలో మంత్రితో పాటు జల్​పల్లి మున్సిపల్ కమిషనర్ జీపీ కుమార్, ఛైర్మన్ అబ్దుల్లాహ్ బిన్ అహ్మద్ సాది, బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్, మేయర్ పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో స్వరాజ్యలక్ష్మి, బాలాపూర్ మండలం తహసీల్దార్ పాల్గొన్నారు.

Last Updated : May 4, 2021, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details