తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలియో చుక్కలతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసా: సబిత - తెలంగాణలో పోలియో చుక్కల కార్యక్రమం

పోలియో చుక్కలతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసానివ్వాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మితో కలిసి ఆమె ప్రారంభించారు.

minister sabitha indrareddy  launches polio drop program in rangareddy district
పోలియో చుక్కలతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసా: మంత్రి సబిత

By

Published : Jan 31, 2021, 1:37 PM IST

పోలియో రహిత సమాజం కోసం అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమాన్ని జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మితో కలిసి ఆమె ప్రారంభించారు.

రెండు పోలియో చుక్కలతో చిన్నారుల ఆరోగ్యానికి భరోసానివ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పిల్లల జీవితాల్లో వెలుగులు నింపటానికి.. పోలియో బారి నుంచి వారిని కాపాడడానికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పోలియో చుక్కల కార్యక్రమం

ABOUT THE AUTHOR

...view details