రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకరవర్గం పరిధిలోని ఎర్రకుంట ఎన్జే గార్డెన్లో మారి సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరై... నిరుపేదలకు నిత్యావసర సరకులను అందజేశారు.
స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టవచ్చు: మంత్రి సబితా - Maari organisation latest news
కరోనా మహమ్మారి నివారణకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కు ధరించాలని మంత్రి సూచించారు.
Rangareddy district latest news
కరోనా విపత్కర సమయంలో ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు ఒక నెలకు సరిపడ నిత్యావసరాలను అందించిన మారి సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. అలాగే ఆ సంస్థ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మారి సంస్థ ప్రతినిధులతోపాటు పలువురు స్థానిక తెరాస నేతలు పాల్గొన్నారు.