హైదరాబాద్(hyderabad) వనస్థలిపురంలోని ఏరియా ఆస్పత్రిలో సూపర్ స్ప్రెడర్ల(super spreaders) వ్యాక్సినేషన్(vaccination)ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పరిశీలించారు. టీకా కోసం వచ్చిన జర్నలిస్టులతో మాట్లాడారు. మౌలిక వసతులపై ఆరా తీశారు. ఇతర సమస్యల గురించి వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు.
vaccination: వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని సందర్శించిన మంత్రి సబిత
వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. సూపర్ స్ప్రెడర్ల(super spreaders) వ్యాక్సినేషన్(vaccination)ను పరిశీలించారు. స్థానికంగా ఉన్న సమస్యల గురించి జర్నలిస్టులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రోజూ సుమారు 1000 మంది వాక్సిన్ కోసం వస్తున్నారని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నిరకాల మౌలిక వసతులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు ఆక్సిజన్ సదుపాయం కలిగిన 20 పడకలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. మరో 100 పడకలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. సూపర్ స్ప్రెడర్ల జాబితాలో ఉన్న వారంతా ఈ స్పెషల్ డ్రైవ్(special drive)ను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.