హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. శ్రీకృష్ణదేవరాయనగర్‌లో గుడిసె దగ్ధమై ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. సూర్యాపేట జిల్లా తొండ తిరుమలగిరికి చెందిన రమేశ్ కుటుంబం... జీవనోపాధి కోసం రెండేళ్ల క్రితం నగరానికి వచ్చింది.
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి సజీవదహనం - current shock man dead
హైదారాబాద్ వనస్థలిపురంలో రమేశ్ అనే యువకుడు విద్యుదాఘాతంతో సజీవ దహనం అయ్యాడు. అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతం.. వ్యక్తి సజీవదహనం
ఎస్కేడీ నగర్‌లో ఓ గుడిసెలో నివాసముంటూ... తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. పిల్లలతో కలిసి భార్య స్వగ్రామానికి వెళ్లగా... రమేశ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అనుమానస్పద స్థితిలో తెల్లవారుజామున గుడిసెకు మంటలు అంటుకుని యువకుడు పూర్తిగా కాలిపోయాడు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇదీచూడండి: ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అదృశ్యం