శంషాబాద్ ఘటన యువతి కాలనీ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విల్లాలో ఉన్న పోలీసులను స్థానికులు బయటకు పంపించారు. స్థానికుల నిరసనతో పోలీసులు వెనుదిరిగారు. కాలనీ గేటుకు లోపలి వైపు కాలనీవాసులు తాళం వేశారు. పోలీసులు, నాయకులు రావొద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు. గేట్ ముందు కూర్చొని ఆందోళన చేస్తున్నారు.
పరామర్శలు వద్దు న్యాయం కావాలి... - undefined
శంషాబాద్ ఘటన యువతి ఇంటి వద్ద కాలనీ గేటుకు లోపలి వైపు కాలనీవాసులు తాళం వేశారు. పోలీసులు, నాయకులు రావొద్దంటూ బోర్డులను ఏర్పాటు చేశారు.
gate lock
మాకు సానుభూతి అవసరం లేదు.. న్యాయం కావాలంటూ బోర్డులు ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ స్పందించి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాధిత యువతి ఇంటి నుంచి పోలీసులు, పలువురు నాయకులు వెనుదిరిగారు. కాలనీలో ఉంటున్న వాళ్లను చెక్ చేశాకే మహిళలు అనుమతిస్తున్నారు.
Last Updated : Dec 1, 2019, 12:44 PM IST