లాక్‌డౌన్ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో.. పోలీసులు కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నారు. సాగర్ రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పది రోజుల పాటు ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాకుండా ఉండేలా అవగాహన కల్పిస్తున్నారు.
కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు - telangana news
రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలుపరుస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో.. ప్రజలు రోడ్డుపైకి రాకుండా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
lockdown at ibrahimpatnam
పోలీసులు.. 10 గంటల తర్వాత వ్యాపార సముదాయాలను మూసి వేయించారు. గడువు సమయం దాటిన తరువాత దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:తెలంగాణకు తాళం పడింది.. అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్..