తెలంగాణ

telangana

ETV Bharat / state

చేవెళ్లలో కేటీఆర్ సభకు ఏర్పాట్లు పూర్తి - mallareddy

లోక్​సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం చేవెళ్లలో నియోజకవర్గ బహిరంగ సభ జరగనుంది. పార్టీ కార్యకర్తలకు ఎన్నికల్లో గెలుపుపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

By

Published : Mar 8, 2019, 8:45 PM IST

సభా ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో శనివారం నిర్వహించే తెరాస పార్లమెంటు నియోజకవర్గ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​తో పాటు రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలిపారు. సభకు సుమారుగా పదివేల మంది కార్యకర్తలు పాల్గొంటారనివెల్లడించారు. పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సభా ఏర్పాట్లలో జాగ్రత్తలు తీసుకున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details