టమాటా రైతుకు సాస్ యంత్రం - agri tech
టమాటా పండించే రైతుల కష్టాలు గట్టెక్కించే దిశగా ఎంపీ కొండా అడుగులేశారు. సాస్ తయారు చేసే యంత్రాన్ని రైతులకు పరిచయం చేశారు.
టమాటా సాస్ యంత్రంపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైతులకు అవగాహన కల్పించారు. రంగారెడ్డి జిల్లాలోని ఎర్రవల్లి గ్రామ రైతు మల్లారెడ్డి పొలంలో యంత్ర పనితీరు, వాడుకను వివరించారు. ధరలు లేని సమయంలో పంటను పొలాల్లో వదిలేయకుండా సాస్, పౌడర్ చేసుకుంటే అధిక లాభం పొందొచ్చని తెలిపారు.పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం పథకాలు వృథా అన్నారు. ధర లేని సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతుల కోసం తన కుమారుడు ఈ యంత్రాన్ని తయారు చేసినట్లు వివరించారు.