రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5కె వాక్ చేపట్టారు. ఈ వాక్‌ను ఆక్టోపస్ డీఎస్పీ సాంబ శివరావు, ఫౌండేషన్ ఛైర్మన్ సదా వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు. పెద్ద చెరువు కట్టపై నుంచి సాగర్ రహదారిపై వందలాది మంది విద్యార్థులు, యువకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ గత 15 ఏళ్లుగా పేద విద్యార్థులకు చేయూతనిస్తున్నారు.
5కె వాక్‌లో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు - ఇబ్రహీంపట్నంలో 5కె వాక్ ప్రారంభం
జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలో 5కె వాక్ నిర్వహించారు. ఈ 5కె వాక్‌ను ఆక్టోపస్ డీఎస్పీ సాంబ శివరావు, ఫౌండేషన్ ఛైర్మన్ సదా వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు.
రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని గ్రామీణ, ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రగతి కోసం దాతల సహకారంతో ఈ సేవా సంస్థ పనిచేస్తుంది. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈ ఫౌండేషన్ కృషి చేస్తోంది. ప్రతిభావంతులైన ఏ ఒక్క విద్యార్థి తన పేదరికం, ప్రోత్సాహం లేని కారణంగా ప్రతిభను కోల్పోకూడదని ఫౌండేషన్ ఛైర్మన్ సదా వెంకట్ రెడ్డి అన్నారు. అలాంటి వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వడానికి అనేక విభాగాల్లో ఫౌండేషన్ సహాయం అందిస్తుందని తెలిపారు.
ఇదీ చూడండి:రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న టమాటా