వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగిపోర్లుతున్నాయి. ఇబ్రహీపట్నం చెక్ డ్యాం పై నుంచి భారీ వరద ఇంద్రసాగర్ చేరుతోంది. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లే దారిలో ఉన్న వంతెన పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి వంతెన తెగిపోయింది.
భారీ వరదతో తెగిపోయిన వంతెన - రంగారెడ్డి జిల్లా వార్తలు
రంగారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పొంగిపోర్లుతున్నాయి. ఇబ్రహీపట్నం చెక్ డ్యాం పైనుంచి భారీ వరద ఇంద్రసాగర్ చేరుతోంది. ఈ క్రమంలో రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లే దారిలో ఉన్న వంతెన పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉద్ధృతికి వంతెన తెగిపోయింది.
భారీ వరదతో తెగిపోయిన వంతెన
భారీ వర్షానికి ఉమర్ఖాన్గూడ చెరువు కట్ట తెగిపోయింది. ఈ వరద వల్ల పక్కగ్రామాలైన అనాజ్పూర్, లష్కర్గూడ, అబ్దుల్లా పూర్పేట్కు రాకపోకలు నిలిపోయాయి. ఉమర్ఖాన్గూడ చెరువు కట్ట తెగడం వల్ల సంఘీ, అనాజ్పూర్ మధ్య రహదారిపై నీరు ప్రవహిస్తోంది. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.
ఇదీ చదవండి:హైదరాబాద్‌లో భారీ వర్షాలపై మంత్రి కేటీఆర్ టెలీ కాన్ఫరెన్స్