రామోజీ ఫౌండేషన్, ఆక్సిస్ లైవ్లీహుడ్ కన్సల్టింగ్ ఇండియా లిమిటెడ్ సహకారంతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం నాగన్‌పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. నాగన్‌పల్లి మహిళా ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో ముత్తూట్, ఆరోగ్య సంచారిణి సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టింది.
గ్రామ పెద్దలతో పాటు గ్రామస్థులు.. ఉచిత ఆరోగ్య శిబిరం ద్వారా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. మొత్తంగా 148 మందికి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి నివేదికలు అందజేశారు.