తెలంగాణ

telangana

'రైతే రాజు అనేది నినాదానికే పరిమితమైంది'

By

Published : Nov 5, 2020, 4:32 PM IST

నగరంలోని వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి ఆర్థిక సాయం చేస్తున్న ప్రభుత్వం... అవే వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం విస్మరించిందని మొయినాబాద్​ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

farmers loss their crops due floods and they need help from government
'రైతే రాజు అనేది నినాదానికే పరిమితమైంది'

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని కనకమామిడి గ్రామంలో... వరదల వల్ల నష్టపోయిన పంటపొలాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జీ మాణిక్కం ఠాకూర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డిలతో కలిసి పరిశీలించారు.

నినాదాలకే పరిమితం..

అప్పు చేసి 5 ఎకరాలలో కేసీఆర్ సూచనలమేరకు పత్తి పంటను వేశామని... తీరా చూస్తే చేతికందే దశలో పైరు నీటిపాలైపోయిందని రైతులు వాపోయారు. అకాల వర్షాల వల్ల ఆగమైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని వరద బాధితులకు ఇంటింటికి వెళ్లి 10వేల రూపాయలు ఇస్తున్నారు కానీ... దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆగమైతే కనీసం మేమున్నామనే భరోసా కూడా ఇవ్వట్లేదని వాపోయారు. రైతే రాజు అనేది నినాదానికే పరిమితమైందన్నారు.

గ్రామంలో నష్టపోయిన రైతుల వివరాలను నాయకులు సేకరించి... రైతులకు అండగా హస్తం గుర్తు ఉంటుందని హామీ ఇచ్చారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణకు వెళ్లారు.

ఇదీ చూడండి:సన్నరకానికి మద్దతు ధర చెల్లించని మిల్లర్లపై టాస్క్​ఫోర్స్ కొరడా

ABOUT THE AUTHOR

...view details