తెలంగాణ

telangana

ETV Bharat / state

సమస్యలు పరిష్కరిస్తాం: రంజిత్​ రెడ్డి - ranjith

తనను గెలిపించినందుకు ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరిస్తామని చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చీరాలలో జరిగిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.

ఎంపీని సన్మానిస్తూ

By

Published : Jul 14, 2019, 8:02 PM IST

రంగారెడ్డి జిల్లా చీరాలలో ఎంపీ, జడ్పీ ఛైర్మన్​, జడ్పీటీసీ, ఎంపీటీసీలకు తెరాస నాయకులు సన్మాన సభ ఏర్పాటు చేశారు. చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి, రంగారెడ్డి జడ్పీఛైర్​పర్సన్​ అనితరెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను ఎమ్మెల్యే కాలె యాదయ్య సన్మానించారు. 84 గ్రామాలను తీవ్రంగా వేధిస్తున్న జీవో త్రిబుల్ వన్ ఎత్తివేసేందుకు సర్పంచులు తీర్మానాలు చేసి పత్రాలు ఇవ్వాలని ఎంపీ రంజిత్​ రెడ్డి కోరారు. వాటిని సుప్రీంకోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. జీవో త్రిబుల్ వన్​పై కేంద్రం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వివరించారు.

సమస్యలు పరిష్కరిస్తాం: రంజిత్​ రెడ్డి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details