హైదరాబాద్‌కు మణిహారంగా నిలిచేలా దుర్గం చెరువుపై నిర్మించిన.. తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. రూ. 184 కోట్ల వ్యయంతో.. 754.38 మీటర్ల పొడవున నిర్మించిన వంతెనను.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, అధికారులు పాల్గొన్నారు.
ఈ వంతెనతో మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గింది. రంగురంగుల విద్యుత్ కాంతులతో.. హైదరాబాద్‌లో మొట్టమొదటి హ్యాంగింగ్ బ్రిడ్జిగా నిలిచింది. దుర్గం చెరువుకు ఇరువైపులా 20 మీటర్ల ఎత్తులో చేపట్టిన వంతెన నిర్మాణంలో 13 ఫౌండేషన్లతో పాటు ఈ వంతెనకు 40 వేల ఎల్ఈడీ లైట్లు అమర్చారు.