ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన వెంకట మహేశ్వర్ రెడ్డి, బోయిన్ పల్లి దమ్మాయిగూడకు చెందిన భావన గతేడాది ఫిబ్రవరిలో కీసర సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్ ఐపీఎస్‌గా ఎంపికయ్యాడు. అప్పుడే అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోతోంది. కట్నం ఇవ్వాలంటూ వేధించడం ప్రారంభించాడని ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్‌నగర్ పీఎస్‌లో భర్తపై కేసు పెట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదని.. మహేశ్వర్ రెడ్డికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
కేసు పెట్టినా పట్టించుకోవట్లేదు.. ట్రైనీ ఐపీఎస్ అనా..? - ట్రైనీ ఐపీఎస్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టినా పట్టించుకోవట్లేదంటున్న బాధితురాలు
ప్రేమించి పెళ్లిచేసుకుని....ఏడాదిన్నర తర్వాత విడాకులివ్వాలని చూస్తున్నాడని శిక్షణలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి భార్య భావన ఆరోపించింది. రంగారెడ్డి జిల్లా కీసరలోని జవహర్‌నగర్ పీఎస్‌లో కేసు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదని వాపోయింది.
ట్రైనీ ఐపీఎస్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టినా పట్టించుకోవట్లేదంటున్న బాధితురాలు
TAGGED:
CASE BOOKED ON TRAINEE IPS