రేపు జరగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. చేవెళ్ల లోక్‌సభ స్థానంలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న 545 కేంద్రాలకు ఈవీఎం యంత్రాలను పంపించినట్లు ఆర్డీవో చంద్రకళ తెలిపారు. ఎక్కడైనా ఈవీఎంలు మొరాయిస్తే ఇంజినీర్లు అందుబాటులో ఉన్నారని.. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు అదనంగా మూడు యంత్రాలను సిద్ధంగా ఉంచామన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పాలమాకుల గిరిజిన కళాశాలలో ఈవీఎంలను భద్రపరుస్తామని చంద్రకళ వెల్లడించారు.
రాజేంద్రనగర్ సెగ్మెంట్‌కు ఈవీఎంలు పంపిణీ - ASHOK CHAKRAVARTHY
చేవేళ్ల పార్లమెంట్ స్థానంలోని రాజేంద్రనగర్ సెగ్మెంట్లో ఉన్న 545 పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు పంపిణీ చేశారు. యంత్రాలు పనిచేయనపుడు ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని.. ప్రతి పోలింగ్ కేంద్రానికి మూడు అదనపు యంత్రాలను సిద్ధంగా ఉంచామని చేవెళ్ల ఆర్డీవో చంద్రకళ వివరించారు.
రాజేంద్రనగర్ సెగ్మెంట్‌కు ఈవీఎంలు పంపిణీ
ఎన్నికల కేంద్రాలకు తరలిస్తున్న ఈవీఎంల వెంట ఎస్సై, ఏఎస్సై స్థాయి పోలీసులను భద్రత కోసం నియమించామని రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఇవీ చూడండి: రేపు చింతమడకలో ఓటు వేయనున్న కేసీఆర్