రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని మోహన్‌బాబు ఫాంహౌస్‌లో హంగామా సృష్టించిన నలుగురు యువకులను పహాడిషరీఫ్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులు రాఘవ్, గౌతమ్, ఆనంద్, సింగరాజులను అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ తర్వాత రిమాండ్‌కు తరలించారు. నిందితులు మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
మోహన్‌బాబు ఫాంహౌస్ ఘటనలో నిందితుల రిమాండ్ - మోహన్‌బాబు ఫాంహౌస్ ఘటనపై తాజా వార్తలు
సినీనటుడు మోహన్‌బాబు ఫాంహౌజ్‌లో శనివారం రాత్రి హంగామా సృష్టించిన యువకులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితులు మైలార్‌దేవ్‌పల్లిలోని దుర్గానగర్‌కు చెందిన వారిగా తెలిపారు.
మోహన్‌బాబు ఫాంహౌస్ ఘటనలో నిందితుల రిమాండ్
శనివారం రాత్రి ఇన్నోవా కారులో టౌన్‌షిప్‌లోకి ప్రవేశించి కారును వేగంగా నడుపుతూ అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులు... ఆకతాయి పనిగా తేల్చారు.