కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. సీపీఎస్ రద్దు అంశంపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు నిరసన తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఆగస్టు 23వ తేదీని చీకటి రోజుగా జరుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఒకే సర్వీస్‌లో ఉన్న ఉద్యోగులకు రెండు రకాల పెన్షన్ ఉండడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులు సామాజిక, ఆర్థిక భద్రతను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.
'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి' - విదానం
ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను రద్దు చేయాలని ఉద్యోగ సంఘ నాయకులు డిమాండ్ చేశారు.
'సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలి'