తెలంగాణ

telangana

ETV Bharat / state

అణచివేతలపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది: నారాయణ - భారతీయ మూలాలు పుస్తకం

భారతదేశ చరిత్రను తెలుసుకునేందుకు 'భారతీయ మూలాలు' పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. కొండాపూర్​లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్​లో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

cpi narayana, bharatiya mulalu
సీపీఐ నారాయణ, భారతీయ మూలాలు

By

Published : Feb 5, 2021, 4:43 PM IST

ప్రజాస్వామ్యంలో జరుగుతున్న అణచివేతలపై మాట్లాడే హక్కు అంతర్జాతీయ సమాజానికి ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్​లోని చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్​లో మర్ల విజయ్ కుమార్ రచించిన 'భారతీయ మూలాలు' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పుస్తకావిష్కరణ చేశారు.

సచిన్​కు కౌంటర్​

ప్రజాస్వామ్యంలో అంతర్గతంగా జరుగుతున్న వ్యవహారాలపై ప్రపంచంలో ఎవరైనా మాట్లాడే హక్కు ఉందని.. సచిన్ వ్యాఖ్యలకు నారాయణ కౌంటర్ ఇచ్చారు. దేశంలో జరుగుతున్న ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని నారాయణ ఆరోపించారు. రైతులు గిట్టుబాటు ధర కావాలని ఆందోళన చేస్తుంటే వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తూ గడ్డపారలు, ముళ్ల కంచెలతో రహదారులు మూసేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను కేంద్రం రద్దు చేసి రైతులకు అండగా ఉండాలని హితవు పలికారు.

అణచివేతలపై మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంది

ఇదీ చదవండి:'పసుపు ఎగుమతులు పెంచుతున్నాం.. ధర పెరుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details