రంగారెడ్డి జిల్లా మేడిపల్లి, కొత్త పల్లి గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో వరుసగా చిరుత దాడులు కొనసాగుతున్నాయి. వారం వ్యవధిలోనే పలుమార్లు మేకల మందలు, ఆవులపై దాడి చేసిన చిరుత రెండు ఆవులు, మేకను హతమార్చింది. శుక్రవారం రాత్రి సమయంలో నంది వనపర్తికి చెందిన యాదయ్య అనే రైతు పొలం వద్ద ఆవుపై దాడి చేసి హతమార్చింది. చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. వరుస దాడులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
చిరుత దాడిలో ఆవు మృతి - leopard attack
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత వరుస దాడులతో భయపెడుతోంది. యాచారం మండలం నందివనపర్తిలో ముచ్చర్ల యాదయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద ఆవుపై దాడిచేసి హతమార్చింది.
చిరుత దాడిలో ఆవు మృతి