రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డి గ్యాంగ్ వరుస దొంగతనాలకు పాల్పడింది. కుంట్లూరు గ్రామంలో రెండిళ్లను దొంగలు దోచేశారు.19.5 తులాల బంగారం, 75వేల నగదు అపహరించారు.
'హయత్ నగర్లో చెడ్డి గ్యాంగ్ హల్ చల్... 2 ఇళ్లల్లో చోరీ'
రాజధాని శివారులో మరోసారి చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో సుమారు 8.5 లక్షల బంగారం, నగదును దొంగలు దోచుకున్నారు.
ఇళ్లల్లో చోరీ చేసిన చెడ్డి గ్యాంగ్
స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. గ్యాంగ్‌లో ఆరుగురు ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు... దొంగల కోసం గాలిస్తున్నారు. చాలారోజుల తరువాత చెడ్డిగ్యాంగ్ వచ్చిందన్న సమాాచారంతో.. శివారు ప్రాంత వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇవీ చూడండి : దర్శనానికి వెళ్తే దొంగలు పడ్డారు..
Last Updated : Nov 22, 2019, 1:29 PM IST