గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన 1500 పడకల టిమ్స్ ఆస్పత్రిని కేంద్ర బృందం పరిశీలించింది. ఆస్పత్రిలో సదుపాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు. టిమ్స్ విశేషాలను కేంద్ర బృందానికి పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ రఘునందన్ రావు, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, ఆరోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రమేశ్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవి కిరణ్ వివరించారు. క్షేత్రస్థాయిలో కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం సమీక్షించింది.
టిమ్స్‌ను సందర్శించిన కేంద్ర బృందం
కరోనా బాధితుల చికిత్స కోసం ఏర్పాటు చేసిన గచ్చిబౌలి టిమ్స్‌ను కేంద్ర బృందం సందర్శించింది. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించింది. ఈ బృందం మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనుంది.
tims
గచ్చిబౌలి ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6.30 కోట్లు మంజూరు చేసింది. ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులను కేటాయించింది. గతంలో కేటాయించిన రూ.18.50 కోట్లకు అదనంగా నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:రాష్ట్రంలో మరో 13 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 25, 2020, 3:23 PM IST