రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. బండ్లగూడ కార్పొరేషన్, మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో అభ్యర్థులు జోరుగా నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు వేయడంలో కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మణికొండలో కాంగ్రెస్ విజయం ఖాయమని ఛైర్మన్ అభ్యర్థి కస్తూరి నరేందర్ ధీమా వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లాలో నామినేషన్ల ఘట్టం ప్రారంభం - Muncipal elections latest updates
పురపాలక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడగానే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి తొలిరోజు భారీగా పత్రాలు దాఖలు చేశారు. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నామినేషన్ల ఘట్టం ప్రారంభం
మీర్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నామినేషన్ దాఖలు కేంద్రాలను కందుకూరు ఆర్టీవో రవీందర్ రెడ్డి సందర్శించారు. ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ దాఖలు చేసే సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ