ఓ మహిళా ప్రయాణికురాలి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన క్యాబ్ డ్రైవర్‌ను శంషాబాద్ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. విమానాశ్రయంలోని ఓ దుకాణంలో పని చేస్తున్న బాధిత మహిళ విధులు ముగించుకుని క్యాబ్‌లో వెళ్తున్న క్రమంలో క్యాబ్ డ్రైవర్ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన సీసీ ఫూటేజీ ద్వారా కారు డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. నిందితుడు బహదూర్‌పుర నివాసి సల్మాన్‌గా గుర్తించి ... అతని నుంచి ఇన్నోవా కారుతో పాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు విమానాశ్రయం ఏసీపీ అశోక్ కుమార్ తెలిపారు.
అసభ్యంగా ప్రవర్తించాడు... ఊచలు లెక్కిస్తున్నాడు - driver
క్యాబ్‌లో ఎక్కిన మహిళా ప్రయాణికురాలిపై అసభ్యంగా ప్రవర్తించాడో క్యాబ్ డ్రైవర్. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫూటేజీ ద్వారా కారు డ్రైవర్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.
అసభ్యంగా ప్రవర్తించాడు... ఊచలు లెక్కిస్తున్నాడు