అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ముఖ్యమంత్రి కుటుంబం జల్సాలు చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. తెరాస ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించడానికే భాజపా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టిందని అన్నారు. 1400 మంది తెలంగాణ కోసం అమరులైతే.. 600 మందినే తెరాస ప్రభుత్వం గుర్తించిందన్నారు. సీఎం కేసీఆర్కు నైతిక విలువలు లేవని ఆరోపించారు. 111 జీవోను రద్దు చేస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికీ రద్దు చేయలేదని చెప్పారు. సీఎంకు ఫాం హౌస్ ఉందని... సీఎం బిడ్డ, కొడుకు, అల్లుడికి ఫాం హౌస్ ఉందన్నారు. చేవెళ్లలో ఎంత మందికి డబుల్ బెడ్ రూం ఇళ్లు వచ్చాయో చెప్పాలన్నారు.
రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు ఆధారం
హైదరాబాద్కు ఆధారం రంగారెడ్డి జిల్లా అని బండి సంజయ్ అన్నారు. పాలు, కూరగాయలు అన్ని రంగారెడ్డి జిల్లా నుంచే వస్తాయన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన గడ్డ రంగారెడ్డి జిల్లా అని చెప్పారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారని గుర్తు చేశారు.