తెలంగాణ

telangana

ETV Bharat / state

కామన్ మ్యాన్ కార్పొరేటర్​లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి - మీర్​పేటలో భాజపా ప్రచారం

రంగారెడ్డి జిల్లా మీర్​పేట హెచ్​బీ 4 డివిజన్​లో భాజపా అభ్యర్థి బంగి జయలక్ష్మి ప్రచారం నిర్వహించారు. తాను గెలిస్తే అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తానని హామీ ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

కామన్ మ్యాన్ కార్పొరేటర్​లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి
కామన్ మ్యాన్ కార్పొరేటర్​లా పనిచేస్తా: బంగి జయలక్ష్మి

By

Published : Nov 27, 2020, 3:31 PM IST

ఒకసారి అవకాశం కల్పిస్తే కమీషన్‌ కార్పొరేటర్‌లా కాకుండా... కామన్‌ మ్యాన్‌ కార్పొరేటర్‌లా కాలనీ అభివృద్ధి కోసం పనిచేస్తానని మీర్‌పేట్‌ హెచ్‌బీ 4 డివిజన్‌ కాలనీ భాజపా అభ్యర్థి బంగి జయలక్ష్మి అన్నారు. ప్రజలకు హామీ ఇస్తూ డివిజన్​లో ప్రచారం నిర్వహించారు.

విద్యా, వైద్యం, మంచి నీరు, మురుగు నీటి సమస్యల పరిష్కారమే మొదటి ప్రాధాన్యత అని ప్రజలకు భరోసానిస్తున్నారు. గతంలో పనిచేసిన కార్పొరేటర్‌ అభివృద్ధి కోసం ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. తనను గెలిపించాలని ప్రజలను కోరారు.

ఇదీ చూడండి:'మేనిఫెస్టోను అమలు చేసి ఇంటింటికి తిరిగి చెబుతాం'

ABOUT THE AUTHOR

...view details