తెలంగాణ

telangana

ETV Bharat / state

పుర పోలింగ్​కు మీర్​పేట్​ కార్పొరేషన్​ సన్నద్ధం - మీర్​పేట్​ కార్పొరేషన్​

పురపోరుకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. ఎన్నికల అధికారులు పోలింగ్​ కేంద్రాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ కార్పొరేషన్​లో పోలింగ్​ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్​ బడుగు సుమన్​ రావు తెలిపారు.

arrangments for polling in meerpet corporation in rangareddy district
పుర పోలింగ్​కు మీర్​పేట్​ కార్పొరేషన్​ సన్నద్ధం

By

Published : Jan 21, 2020, 11:08 AM IST

పుర పోలింగ్​కు మీర్​పేట్​ కార్పొరేషన్​ సన్నద్ధం

రంగారెడ్డి జిల్లా మీర్​పేట్​ కార్పొరేషన్​లోని 46 వార్డుల్లో 138 పోలింగ్​ కేంద్రాలు ఏర్పాటు చేశారని కమిషనర్​ బడుగు సుమన్​రావు తెలిపారు. 800 మంది సిబ్బందిని కేటాయించినట్లు వెల్లడించారు.

మీర్​పేట్​ కార్పొరేషన్​లో 23 పోలింగ్​ కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని కమిషనర్​ సుమన్​రావు తెలిపారు. 17కేంద్రాల్లో వెబ్​ క్యాస్టింగ్, 6 స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్​లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

పోలింగ్​ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని కమిషనర్​ సుమన్​రావు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details