రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాంపేట గేటు సమీపంలో టీవీఎస్ వాహనాన్ని మండల విద్యాశాఖాధికారి కారు ఢీకొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న దంపతులు గాయపడ్డారు. వీరిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు. మృతులు ఆరుట్ల గ్రామానికి చెందిన పూసల అంజయ్య, ఆండాలుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
టీవీఎస్ వాహనాన్ని ఢీకొన్న ఎంఈవో కారు.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా సీతారాంపేట గేటు సమీపంలో ఓ టీవీఎస్ వాహనాన్ని మండల విద్యాశాఖ అధికారి కారు ఢీ కొట్టింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరుట్ల గ్రామానికి చెందిన దంపతులు మృతిచెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి